ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణంతో రాజ్యం సుభీక్షంగా ఉంటుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి.

ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణంతో రాజ్యం సుభీక్షంగా ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మరుగున పడిన ఆలయాలను పునర్ని ర్మాణం చేస్తున్నారని,అందులో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు,మజీద్లు,దర్గాలు, చర్చిల నిర్మాణానికి రూ.150 కోట్ల నిధులు మంజూ రు చేశారని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచా రం శ్రీనివాస అన్నారు.శుక్రవారం రోజున పోతంగల్ మండల కేంద్రంలో రూ.30 లక్షల సీఎం స్పెషల్ డెవల ప్మెంట్ ఫండ్స్ తో హనుమాన్ మందిర నిర్మాణ పను లకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం పోతంగాల్లో రూ.15 లక్షలతో నిర్మించిన హనుమాన్ మందిర కమ్యునిటీ హాల్ ను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.ఆలయ నిర్మాణాలు భక్తికి సంకేతాలని.నోటి మాటతో కాకుం డా హృదయం నుండి వచ్చే నిజమైన భక్తికి దేవుడు కూడా చల్లగా ఆశీర్వదిస్తాడని అన్నారు.ఆలయాల నిర్మాణంలో మనం సేవకులం మాత్రమేనని మిగిలిన ది అంతా భగవంతుని ఇచ్ఛ.ధర్మాత్ముడు పాలకుడు గా ఉన్న రాజ్యంలో వర్షాలు సమృద్దిగా కురిసి పుష్క లంగా పంటలు పండుతాయని అన్నారు.మహాభార త సమయంలో కౌరవుల పాలనలో కరువు పాండవు లు రాజ్యాధికారం చేపట్టగానే సమృద్ధిగా వర్షాలు కురిసి రాజ్యం సుభిక్షంగా మారిందని అన్నారు.దేశం లోని కొన్ని ప్రాంతాలలో కరువు పరిస్థితులు ఉన్నా యి.కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పుష్క లంగా పంటలు పండిస్తూ ఇతర ప్రాంతాలకు ఎగు మతులు చేస్తున్నాం.ధర్మాన్ని మనం కాపాడితే దేవు డు కూడా అన్ని రకాలుగా మనలను కాపాడుతాడని స్పీకర్ పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ వర్ని శంకర్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,స్థానిక సింగిల్ విండో చైర్మన్ శాంతీశ్వర్ పటేల్,వైస్ చైర్మన్ గంధపు పవన్,మాజీ సర్పంచ్ రమేష్ సేట్,గంట్ల విఠల్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సందాని,ఉమ్మడి మండల ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,పోతంగల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

తాజావార్తలు