ఆపత్కాలంలో అండగా సీఎంఆర్ఎఫ్ ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
కుబీర్( జనం సాక్షి 30): ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం రోజున ఎమ్మెల్యే జి.విట్టల్ రెడ్డి కుబీర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి సుమారు రూ.4 లక్షల 79 వేయిల విలువైన చెక్కులను పంపిణి చేశారు. బి. రమేష్(చోండి)రూ. 30000, రాథోడ్ మదన్ (పల్సి తండా)రూ.29,500, పోశెట్టి (గోడపూర్) రూ.16000, భాగ్యశ్రీ (గోడపూర్) రూ.14000. ప్రేమల (నిగ్వ)రూ.200000, లక్ష్మణ్ (కుప్టీ) రూ.24000, రాథోడ్ అజేష్ (డో డర్నా)రూ.24000, లక్ష్మి (చాత) రూ.57500, రాజమణి (సిర్పేల్లి) రూ.45000, వంటి వివిధ వ్యక్తులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు. ఈసందర్బంగా విట్టల్ రెడ్డి గారు మాట్లాడుతూ…పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ముధోల్ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. సీఎం కెసిఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్,ఎక్స్ జడ్పీటీసీ చవాన్ శంకర్, కో -ఆప్షన్ మెంబెర్ దత్తహరి పటేల్, ఆ గ్రామ సర్పంచులు, ఎంపిటిసిలు, తెరాస నాయకులు మిలింద్, బాపూరావు, సాహెబ్ రావ్, తదితరులు పాల్గొన్నారు.