ఆపదలో అండగా ఉంటాం

మరిపెడ, జులై 24(జనం సాక్షి ):ప్రజలు ఆపదలో ఉంటే అండగా ఉంటామని టీఆరెఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ లు అన్నారు.
 ఆదివారం వారు మండలంలోని చావ్లా తండాలో వరద బాధిత కూలీలను  జిల్లా గ్రంథాలయ సంస్థ చెర్మెన్ గుడిపూడి నవీన్ రావుతో కలిసి వారిని పరామర్శించించారు, ఈ సందర్బంగా వారికి ఒక నెల నిత్యావసరాలు, ఒక్కరికి రూ.3000వేల ఆర్థిక సాయం అందించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భగవంతుడి చల్లని చూపుతో 22మంది ప్రాణాలతో బయట పడ్డారని, అంతటి విపత్కర పరిస్థితుల్లో 17 మంది మహిళలు ధైర్యంగా ఉండటం సామాన్య విషయం కాదన్నారు. అందులో ఓ మహిళ ప్రతినిధి ఉండటం  ఆమె సెల్ ఫోన్ ద్వారా అందరికి విషయం చేరవేయటంతో నేడు అంతా సురక్షితంగా బయట పడ్డారన్నారు.  శుక్రవారం ఎమ్మెల్యే రెడ్యానాయక్ హైదరాబాద్లో ఉన్నప్పటికీ రాత్రి విషయం తెలుసుకుని స్థానిక తెరసా నాయకులు తేజవత్ రవీందర్, తేజవత్ బాలాజీ లను అక్కడికి పంపి, అధికారులు, పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ..l జిల్లా పాలన అధికారులతో మాట్లాడి కూలీలను ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వం తరపున కృషి చేశారన్నారు.  విపత్కర పరిస్తితి నుంచి క్షేమంగా కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందానికి, రాత్రంతా శ్రమించిన అధికారులకు, తెరాస నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వానలు అధికంగా కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలు, చేపల వేటకు, ప్రమాదకర విద్యుత్ స్తంభాలు జోలికి పోకుండా ఉండాలని సూచించారు. దేవుడు ఇచ్చిన ఒకే ఒక జీవితాన్ని నిలుపుకోవలని, ప్రమాదమని తెలిసిన వెళ్ళటం మంచిది కాదని పొంగే వాగులు, అలుగు పొసే చెరువుల వద్దకు వెళ్ళొద్దని తెలిపారు. డోర్నకల్ అడబిడ్డగా కష్టం నుంచి బయట పడిన 22మంది తన సోదరి, సోదరులకు తనవంతుగా రూ.3000వేల ఆర్థిక సాయం, ఒక నెల నిత్యావసరాలు బియ్యం, చెక్కర, నూనె, పప్పులు, చీరె, చెద్దర్ తదితర వస్తువులు అందించటం జరిగిందన్నారు. అక్కడి నుంచి ఆర్లగడ్డ తండాలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బదావత్ రవి బాలి దంపతులకు నిత్యావసరాలు, నగదు సాయం చేశారు. ఈ కార్యక్రమం లలో రామడుగు అచ్యుత రావు, జడ్పీటీసీ తేజవత్ శారద రవీందర్, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, మాజీ జడ్పీటీసీ బాలనే మాణిక్యం, తెరసా జిల్లా నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, మాణిక్యం, మూల మురళీధర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, తెరాస చిన్నగూడూర్ పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, తెరాస నాయకులు పాదురీ రామచంద్ర రెడ్డి, తెరాస తానంచెర్ల గ్రామ పార్టీ అధ్యక్షుడు సీత వెంకన్న, తెరాస నాయకులు తేజవత్ బాలాజీ, తేజవత్ సురేష్, అజ్మీరా శీను, రెడ్యా, శంకర్, తదితరులు పాల్గొన్నారు.