ఆపదలో అండగా నిలుస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్, జూన్ 15  జనం సాక్షి.
ఆపదలో  ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటకు గ్రామానికి చెందిన కానుగంటి రాజు కుమార్తె ప్రసన్న అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రసన్న ఆపరేషన్ గురించి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు 400000/- రూపాయల ఎల్ ఓ సి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  అందజేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో దొమ్మట మాజీ సర్పంచ్ గన్నమనేని మోహన్ రావు, గాజులపల్లి సర్పంచ్ అప్పవారు శ్రీనివాస్ పాల్గొన్నారు