ఆపదలో ఆదుకోవడమే నిజమైన మానవత్వం : సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తాన ఉమర్.

దౌల్తాబాద్ అక్టోబర్ 23, జనం సాక్షి.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడములోనే నిజమైన సంతృప్తి ఉంటుందని అదే మానవత్వం అని సామాజిక ప్రజా సేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సం పల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొడ్డి స్వామి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు.ఆదివారం చెట్ల నర్సం పల్లి గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు,ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి అకాల మరణం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు.
ఆధునిక కంప్యూటర్ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో మానవత్వం మర్చిపోతున్న నేటి సమాజంలో ఆపదలో ఉన్న అభాగ్యులకు సహాయం చేస్తూ చేయూతనివ్వడంలోనే జీవితానికి సార్థకత ఉంటుందని,కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి సహకారం అందించకుండా మానవతా విలువలు మర్చిపోతున్న తరుణంలో నిరుపేదలు అభాగ్యులకు సహాయం చేయడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు. ఎన్ని ఆస్తులు డబ్బులు సంపాదించినప్పటికీ కలగని సంతృప్తి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే ఉంటుందన్నారు. మనం సహాయం చేయడం వలన వారి జీవితాల్లో మార్పు రానప్పటికీ తక్షణంగా వారికి ఎంతో ఆసరాగా ఉంటుందని సమాజంలో ఎంతోమంది ధనవంతులు, కోటీశ్వరులు ఉన్నప్పటికీ నిరుపేద అభాగ్యులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని, నిరుపేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేమ జనార్దన్, ఏఎంసి వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, సామాజిక సేవకులు మహమ్మద్ ఉమర్,గ్రామస్తులు పసి నర్సింలు, మల్లేశం, నర్సయ్య, శ్రీను, గోపి, ప్రభాకర్,శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area