ఆపదలో ఉన్న కుటుంబాలను అన్నీ విధాలా ఆదుకుంటా *జడ్పీటీసి పబ్బా మహేశ్

శివ్వంపేట జూన్ 30 జనంసాక్షి :ఆపదలో కుటుంబాలను నాకు తోచిన విధంగా అన్నీ విధాలా ఆదుకుంటానని జడ్పీటీసి పబ్బా మహేశ్ గుప్తా అన్నారు. శివ్వంపేట మండలం చండీ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బాల గౌడ్  గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా గురువారం పార్టీ శ్రేణులతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి తన స్వంత డబ్బులు  5 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసి మాట్లాడుతూ అనారోగ్యంతో కాలు తీసేయడం వల్ల ఎమ్మెల్యే మదన్ రెడ్డి సహకారంతో త్వరలో కాలు కూడా పెట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లం, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ముత్యంరెడ్డి, నాయకులు బల్వంత్ రెడ్డి, సత్యనారాయణ, కృష్ణారెడ్డి, చండీ గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.