ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న గ్యాస్ ట్యాంకర్
భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం సీతాంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురగా వస్తున్న గ్యాస్, అయిల్ ట్యాంకర్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అయిల్ ట్యాంకర్‌కు నిప్పంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే యత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో సుమారు అయిదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.