ఆయిల్ పామ్ పంట మరియు పీఎం కిసాన్ పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట మరియు పీఎం కిసాన్ పై అవగాహన సదస్సు.

మల్లాపూర్ , సెప్టెంబర్27 ( జనం సాక్షి)మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఆయిల్ పామ్ పంట మరియు పీఎం కిసాన్ పై బుధవారం అవగాహన కల్పించారు ఇంచార్జి కోరుట్ల డివిజన్ ఏడిఏ లావణ్య మాట్లాడుతూ సంప్రదాయ పంటల నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. ప్రభుత్వం అందుకు అనుగుణంగా రాయితీలతో ప్రోత్సాహం అందిస్తోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించే క్రమంలో ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడిలతో మొక్కలు, ఎరువులు, డ్రిప్‌ పరికరాలు, అంత ర్‌పంటల సాగు వంటి వాటికి ప్రోత్సాహం అంది స్తోంది.     మొక్కలు సరఫరా చేయడం, ఆయిల్‌పాం గెలలు మళ్లీ కొనుగోలు చేయడానికి  లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీని ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు కేటాయించింది. ఈ కంపెనీ  జగిత్యాల్  జిల్లా లోని అబ్బాపూర్ వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పాం మొక్కలు పెంచడానికి నర్సరీని ఏర్పాటు చేసింది.
 ఆయిల్‌పాం సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఎకరానికి 57 మొక్కలు నాటుకోవచ్చు. సంవత్సరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తోంది.  ఖర్చులు పోనూ రైతుకు ఒక ఎకరానికి లక్ష వరకు ఆదాయం సమకూరుతుంది. మరోవైపు రైతులకు మార్కెటింగ్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే కంపెనీని కేటాయించింది. ఆయిల్‌పాం మొక్కల కోసం ఎకరానికి 9650 రూపాయలు సబ్సిడీని అందిస్తోంది. మొదటి సంవత్సరం తోట నిర్వహణ అంతర్‌పంటల సాగు కోసం నాలుగు విడతలుగా రూ.4200 చొప్పున ప్రతి సంవత్సరం  ఇస్తోంది.  ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రాయితీపై డ్రిప్‌ పరికరాలు అందిస్తారు. బీసీలకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీలు ఉన్నాయి.
ఆయిల్‌పాం సాగు కోసం తోటలకు అనువైన భూమి, పట్టాదారు పాసు పుస్తకం, బోరు, లేదా వ్యవసాయ బావి, కరెంట్‌ కనెక్షన్‌ ఉన్న రైతులు ఆయిల్‌పాం సబ్సిడీకి అర్హులు. రైతులు ఎన్ని ఎకరాల్లో నైనా ఆయిల్‌పాం సాగు చేసుకోవచ్చు. రైతులకు అవసరమైనన్నీ ఆయిల్‌పాం మొక్కలను రాయితీపై ఇస్తారు. బిందు సేద్యం పరికరాలు మాత్రం గరిష్టంగా 12.5 ఎకరాలకు మాత్రమే వర్తిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సాయి ప్రియ చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ సాయబు ఎంపీటీసీ మైసలక్ష్మి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నూతుల లక్ష్మీనారాయణ రైతులు రాజారెడ్డి గంగారెడ్డి మోహన్ రెడ్డి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు