ఆరుగురు ఎర్రచందనం దొంగల అరెస్ట్‌

కారు, రూ.4.50లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

కడప,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): లక్కిరెడ్డిప్లలె సర్కిల్‌ పరిధిలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో దుంగలను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన పోలీసుల పైకి స్మగ్లర్లు ఎదురు దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. రామాపురం మండలంలోని గువ్వలచెరువు, లక్కిరెడ్డి ప్లలె మండలం లోని ఎగువమూల ప్లలె, చక్రాయపేట మండలంలోని గొంది ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు దాచి ఉంచారనే సమాచారంతోపోలీసులు దాడులు చేశారు. దేవరాజు, రాయప్ప, విశ్వనాథరెడ్డి, సుబహాన్‌, బాల ఓబులేసు, అబ్దుల్‌లను అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారయ్యారని పులివెందుల డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఓ టయోట కారు, రూ.4.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

 

తాజావార్తలు