ఆరుగురు చిన్నారులపై ఆయాల రాక్షసత్వం
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని శిశు గృహంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. అన్నం తొందరగా తినకుండా అల్లరి చేస్తున్నారని ఐదేళ్ల లోపు ఆరుగురు అనాథ చిన్నారులకు విధుల్లో ఉన్న ఆయాలు చేతులపై వాతలు పెట్టారు. ఉదయం తనిఖీకి వచ్చిన ఐసీడీఎస్ అధికారులు చిన్నారులకు వాతలు ఎవరు పెట్టారని ప్రశ్నించారు. సిబ్బంది సమాధానం చెప్పక పోవడంతో సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. చిన్నారులకు వాతలు పెట్టిన ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. చిన్నారులకు వాతలు పెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ సభ్యులు డిమాండ్ చేశారు.