ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన
జిల్లా ఆత్మ చైర్మన్ తోట లాలయ్య
సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి
జూలై –
(జనంసాక్షి న్యూస్)
కురవి మండలం రాజోలు గ్రామంలో హెల్త్ క్యాంపును ప్రారంభించిన మండల అధ్యక్షుడు తోట లాలయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ డయాగ్ని క్ సెంటర్లు పెట్టి పేదలకు ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపట్ల ప్రజలు విశ్వాసం తో ఉండాలన్నారు. మండల ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ మస్తాన్,గ్రామ కార్యదర్శి నిమ్మల సతీష్, మత్య పారిశ్రామిక సొసైటీ చైర్మన్ బసనబోయిన వెంకన్న,టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి కైలాసపు మాధవరావు,కేదాసు,రాంబాబు,మారగా ని శ్రీను, ఏఎన్ఎం నజియా,ఆశ కార్యకర్తలు గొల్లపల్లి శ్రీలత,భూక్య శైలజ,వినోద,గుమ్మడి.ఉపేంద్ర, తదితరులు పాల్గొన్నార