ఆర్టీఐ చట్టానికి సవరణ చేస్తే..

పనికిరాకుండా పోతుంది
– భారతీయులంతా సవరణను వ్యతిరేకించాలి
– రాహుల్‌ గాంధీ ట్వీట్‌
న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కు సవరణలు తీసుకురావాలని మోడీ ప్రభుత్వం ప్రతిపాదించడంపై ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. మార్పులు చేస్తే ఇది ‘పనికిరాని చట్టం’గా మారుతుందని, దేశంలోని ప్రతి వ్యక్తికీ సత్యాన్ని తెలుసుకునే హక్కుందన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశంలో ఆర్టీఐ బిల్లు 2018ను రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ (సిఐసి), ఇన్ఫర్మేషన్‌ కమిషనర్ల(ఐసి) ర్యాంకులు, జీతాలు, పదవీకాలానికి
సంబంధించిన విభాగాలకు మార్పులు ఆధారంగా సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ ‘ప్రతి భారతీయునికీ నిజం తెలుసుకొనే హక్కుందని, అధికారంలో ఉన్న వ్యక్తులను ప్రశ్నించకూడదని బీజేపీ అభిప్రాయ పడుతోందన్నారు. ఈ చట్టంలో చేస్తున్న మార్పులను భారతీయులందరూ వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ సవరణల కోసం ఉద్దేశాలు, కారణాల గురించి పేర్కొంటూ, ‘ఎన్నికల కమిషన్‌ ఆఫ్‌ ఇండియా , కేంద్రం, రాష్టాల్ర సమాచార కమిషన్‌ నిర్వహిస్తున్న విధులు పూర్తిగా భిన్నమైనవి. అందువల్ల వారి ¬దా, సేవా పరిస్థితులకు అనుగుణంగా హేతుబద్ధీకరించాలని రాహుల్‌ అభిప్రాయపడ్డారు.