ఆర్టీసీ కార్మికుల రిలేనిరాహర దీక్షలు

ఆదిలాబాద్‌: డిపో మేనేజర్‌ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌యూనియన్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ డిపోముందు కార్మికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండువరోజుకు చేరాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా దీక్షల్లో కూర్చుని నిరసన తెలియజేశారు. కార్మికుల సస్పెన్షన్లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.