ఆర్టీసీ డిపోల్లో 5న విజయోత్సవాలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): జిల్లాలోని ఆర్టీసీ సంస్థలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో  ఐక్యకూటమి ఘన విజయాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని డిపోల్లో జనవరి 5వ తేదీన విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు గుర్తింపు పొందిన ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ కార్యదర్శులు వెంకటయ్య, కిషన్‌రావులు తెలిపారు. రీజన్‌ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఐక్య కూటమికి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి కార్మికుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి కార్మికుల సంక్షేమానికి, వారి హక్కుల కోసం నిరంతరంగా పోరాడుతామన్నారు. జనవరి 5న అధికారికంగా సంస్థ నుంచి గుర్తింపు లభిస్తున్నందున కార్మికులు నిర్వహించే విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.