ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి కమిటీ
– సీనియర్ ఐఎఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ మంత్రి మండలి నిర్ణయం
– ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన కార్మిక సంఘాలతో చర్చలు
– సమ్మెకు పోయి సొంత సంస్థనే నష్టపరచవద్దని విజ్ఞప్తి
– పండుగ దృష్టా ప్రజలకు ఇబ్బందులక గురిచేయొద్దని సూచన
హైదరాబాద్,అక్టోబర్ 1 (జనంసాక్షి):
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వా నికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఎఎస్ అధి కారులతో కమిటీ వేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గు రు ఐఎఎస్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కమిటీని నియమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినె ట్ సమావేశం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయిన సమావేశం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఆర్టీసీ కార్మికులు వివిధ డిమాండ్లతో సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో వారి డి మాండ్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామ కృష్ణరావు, సునీల్ శర్మ సభ్యులుగా సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆర్టీసీ కార్మికులతో బుధవారం చర్చించనుంది. వారి డిమాండ్లను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వానికి వీలైనంత తొందరలో నివేదిక ఇవ్వనుంది. అధికా రులు ఇచ్చే నివేదికను అనుసరించి ప్రభుత్వం చర్య లు తీసుకోనుంది. పేద ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకో వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. అధికారు ల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆర్టీసీ పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి నిర్ణయించింది. | ఆర్టీసీ ఇప్పటికే ఆర్థికంగా నష్టాల్లో ఉన్నందున, సమ్మె యోచన విరమించుకుని సహకరించాలని కార్మికులకు రాష్ట్ర మంత్రి మండలి విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే తమ డిమాండ్లు చెప్పారని, ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీతో చర్చించాలని కేబినెట్ సూచించింది. డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా సంస్థను కాపాడాలనే కృతనిశ్చయంతో ఉందని కేబినెట్ స్పష్టం చేసింది. ఈ సమయంలో సమ్మెకు పోయి కార్మికులు సౌత సంస్థనే నష్టపరచవద్దని విజ్ఞప్తి చేసింది. కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని మంత్రి మండలి సూచించింది. ప్రజలంతా పండుగలకు తను సొంతూర్లకు పోయే సందర్భంలో సమ్మెకు పోయి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కార్మికులను మంత్రి మండలి కోరింది.