ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

అదిలాబాద్‌: మంచిర్యాల మండలం అర్కే-6 కాలనీలో భార్యాభర్తలు ఈ రోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీరు ఆత్మహత్యకు  పాల్పడినట్లు స్థానికులు తెలియజేశారు. పంట నష్టపోయిన కౌలురైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాసిన  లేఖ సంఘటనాస్థలంలో దొరికింది.