ఆలయం వద్దకు చేరుకున్న ధ్వజ స్తంభాలు

చండ్రుగొండ జనంసాక్షి (జూలై  29)
మండల కేంద్రంలోని  శ్రీ  మహాలక్ష్మీ అమ్మవారు,    సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠ  ఆగస్టు  3 నుండి  ప్రారంభం అవుతున్న నేపధ్యంలో  శుక్రవారం ధ్వజ స్తంభాలు గ్రామానికి చేరుకున్నాయి. ప్రతిష్ఠ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపుగా  ధ్వజస్తంభాలను ఆలయం వద్దకు చేర్పించారు. భక్తులంతా  నీళ్లు పోస్తూ  కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్బంగా  ప్రముఖ వేదపండితులు  విప్పర్ల   వెంకట రామకృష్ణ మూర్తి మాట్లాడుతూ 5రోజుల పాటు  ప్రతిష్టాత్మక కార్యక్రమాలు వైభవంగా   జరుగుతాయన్నారు. సాయిబాబా మహాలక్ష్మి అమ్మవారిని విగ్రహాలతో పాటు  ఆంజనేయస్వామి ఆలయం వద్ద  ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు  భక్తులంతా  ఐదు రోజుల పాటు  జరిగే  ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలలో  పాల్గొన్నారన్నారు  ఈ కార్యక్రమంలో  ప్రతిష్ఠ కమిటీ బాధ్యలు చీదెళ్ల పవన్ కుమార్ ,పెదీన్ని  వేణు,కుక్కడపు రామారావు,కుక్కడపు నరేష్,  మక్కా రమేష్, శ్రీను  కంభం పాటి దామోదర్,మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area