ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమం

ఆదిలాబాద్‌, జూలై 25 : జిల్లాలోని ఆలయాల అభివృద్ధితోపాటు భక్తీ భావన పెంపొందించేందుకు మన గుడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ కార్యక్రమ జోనల్‌ అధికారి, బాసర ఆలయ ఇవో ముత్యాలరావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ఆలయాల్లో పూజలు జరిపించి వాటిని శుద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. శ్రీవెంకటేశ్వరస్వామి శ్రావణనక్షత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర దేవాదయ శాఖ, టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు 2న మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇందులో భాగంగా బాసర పుణ్యక్షేత్రంతోపాటు జిల్లాలోని 97 ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు డివిజన్‌, మండలాలవారిగా అధికారులను నియమించామని అన్నారు. కరపత్రాలు, గోడ ప్రతులు ఫెక్సీ బ్యానర్ల ద్వారా ప్రచారాన్ని చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని అన్నారు.

తాజావార్తలు