ఆలస్యంగా మొదలైన ఇంటర్‌ పరీక్ష

గుంటూరు విద్య : ఫిరంగిపురం రూరల్‌ క్రిస్టియన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మీడియట్‌ పరీక్ష శుక్రవారం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పరీక్ష కేంద్రానికి ఎకనామిక్స్‌ పాఠ్యాంశం ప్రశ్నాపత్రాలు తెలుగు మాధ్యమం బదులు ఇంగ్లీషు మాధ్యమం ప్రశ్నాపత్రాలు రావడంతో పరీక్ష ఆలస్యంగా మొదలైంది. విషయం తెలుసుకున్న అధికారులు గుంటూరు లోని స్ట్రాంగ్‌ రూం నుంచి తెలుగు మీడియం ప్రశ్నాపత్రాలు అందించారు. వెంటనే పరీక్ష కేంద్రాన్ని ఇంటర్‌ విద్య ఆర్‌జేడీ జంగమయ్య చేరుకుని పరీక్ష సమయాన్ని గంట పొడిగించారు.