ఆల్ఫోర్స్ లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 04:దశావతారాలలో శ్రీకృష్ణుడు ఒకటీ అని యావత్ జగత్తుకు ధర్మరక్షకుడిగా వ్యవహరిస్తారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడారు. భైంసా పట్టణంలోని స్థానిక ఆల్ఫోర్స్ పాఠశాలలో పండగ వాతావరణం తలపించే విధంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు విద్యార్థులు గోపిక కృష్ణుని అలంకరణలతో ఆకట్టుకున్నారు విద్యార్థులు ఉట్టి వేడుకల్లో ఆనంద ఉత్సవాన్ని ప్రదర్శించి ఉట్టిని కొట్టారు. విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుక చాలా విశిష్టమైన చరిత్ర గలదని శ్రీకృష్ణుని తల్లి ప్రేమకు నిర్వచనం గా ప్రేమ ఆప్యాయతకు ప్రతిబింబమని శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు ఆలోచింపజేస్తాయని ఆనందాన్ని వెదజల్లుతాయని శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం చాలా కీలకమైన ఘట్టమని వివరించారు ధర్మ పోరాటానికి శ్రీకృష్ణుడు చేసిన కృషి నేటికీ నిదర్శనం అని తెలియజేశారు వారి చరిత్ర ఆధారంగా రచించిన శ్రీమద్ భగవద్గీత వరించడం వలన పలు రోగాల నుండి విముక్తి పొందుతున్నామని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్,ఉపాద్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు.