ఆళ్లపల్లి లో ఘనంగా ముత్యాలమ్మ తల్లి బోనాలు
ఆళ్లపల్లి ఆగస్టు 07 (జనం సాక్షి)
మండల కేంద్రంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లి బోనాలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో ముత్యాలమ్మ తల్లికి ప్రజలు బోనాలు చెల్లిస్తుంటారు. భక్తులు ఉదయం నుండే కోలహాలంతో ఇంటికి తోరణాలు కట్టుకొని తల్లికి బోనాలు వంటి చేసి సాయంకాలం సమయంలో గ్రామ శివారులోని ఉన్న ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. తొలుత గ్రామ దేవత అయినటువంటి బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని అనంతరం ముత్యాలమ్మ తల్లి దగ్గర బోనాలు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు రోజా సోమలక్ష్మి పద్మ సుగుణ శైలజ స్వరూప లక్ష్మి భవాని మౌనిక జానకమ్మ స్వరూప లక్ష్మి రస్మిత లక్ష్మి సరిత దేవి తదితరులు పాల్గొన్నారు