ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ

టేకులపల్లి, నవంబరు 1( జనం సాక్షి ): ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యము, వెల్నెస్ సెంటర్స్ కార్యక్రమంలో భాగంగా వృద్ధాప్యం, అవసాన దశ లో ఉన్న వారికి దీర్ఘకాలిక వ్యాధులు, ప్రమాదంలో చికిత్స పొందుతూ మంచానికే పరిమితమైన అభాగ్యులకు, మానసిక రోగులకు సాంత్వన చేకూర్చడంలో భాగంగా మండలంలోని ఆశా కార్యకర్తలకు సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న మూడు రోజుల శిక్షణ కార్యక్రమం లో భాగంగా మంగళవారం రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి జిల్లా ప్రజా ఆరోగ్య అధికారిని డి పి హెచ్ ఎన్ అన్న మేరీ హాజరై శిక్షణను ఇచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పై రోగులకు ఆశా కార్యకర్తల ద్వారా అవసాన దశలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని కావాల్సిన సాంత్వన ఆత్మీయ స్పర్శని అంతిమ దశలో నేనున్నాను అని మానసిక ధైర్యాన్ని కలిగించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఆమె అన్నారు. అలాగే గర్భిణీ స్త్రీలను త్వరగా రిజిస్టర్ చేసి వారికి కావాల్సిన పరీక్షలు అన్నీ చేపించి ప్రమాద పరిస్థితులలో ఉన్న గర్భిణీలను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్సలు అందజేయాలని, అదేవిధంగా రక్తహీనతతో ఉన్నవారికి ప్రత్యేక అదనపు పోషకాహారం తీసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలియేటివ్ కేర్ శిక్షకులు అమరావతి, చిట్టెమ్మ, లెప్రసి అధికారి గన్యా,సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ,సూపర్వైజర్లు గుజ్జ విజయ, వీసం శకుంతల, పోరండ్ల శ్రీనివాస్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు