ఆశించే స్థాయి నుంచి.. శాసించే స్థాయికి చేరాలి – మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చామకూర రాజు
జనంసాక్షి, మంథని : మున్నూరు కాపులంతా ఆశించే స్థాయి నుంచి.. శాసించే స్థాయికి చేరుకోవాలని మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చామకూర రాజు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామిలు అన్నారు. మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎస్ఎల్‌బీ గార్డెన్స్‍లో మున్నూరు కాపు ఐకాన్ అవార్డును గురువారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్నూరు కాపు కులస్థులంతా ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదికన అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపు కులస్థులంతా రాజకీయంగా ఎదగక పోవడం బాధకరమన్నారు. మన కులమే మనకు బలమని.. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మున్నూరు కాపులంతా మన కులానికి చెందిన నాయకులకు పూర్తి స్థాయిలో మద్ధతు ఇచ్చిన వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు మున్నూరు కాపు కులానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ దివంగత పుంజాల శివ శంకర్ 94వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు పెండల సంపత్, కొత్త శ్రీనివాస్, ఆకుల కిరణ్, జక్కుల ముత్తయ్య, అమిరిశెట్టి రామస్వామి, పుల్లెల కిరణ్, కుడిది చలం, శ్రీపతి బానయ్య, తోట జనార్థన్, వెంకటస్వామి,రాజేశం, శంకెసి రవీందర్, సమ్మయ్య, బాద్రపు సమ్మయ్య, నీలం శ్రీనివాస్, ఆకుల బాపులతో పాటు తదితరులు పాల్గొన్నారు.