ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి.

సిఐటియూ జిల్లా నాయకులు నరసింహ అలంపూర్ సెప్టెంబర్ 28(జనంసాక్షి )
ఉండవల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ఆవరణలోగత కొన్ని రోజులనుండి ఆశ కార్యకర్తలు కనీస వేతనం 18000 చేయాలని నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. అట్టిసమ్మెకు సీఐటీయూ జిల్లా నాయకులు బీ. నరసింహ సంగీభవం తెలిపారు. ఈసందర్బంగా నరసింహ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ,,18000/-రూ, లు అమలు చేయాలని, ఆశ వర్కర్లకు కనీస వేతన అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విపలమైందని అన్నారు. ఆశలకు పి. ఎఫ్, ఇ ఐస్ ఐ సౌకర్యo ఉద్యోగ భద్రత కల్పించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షలు ఇవ్వాలి అని అన్నారు. సీఐటీయూ మండల కార్యదర్శి యం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశ వర్కర్లు 28. వేల మంది హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. వీరందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని, రాష్ట్రంలో పేద ప్రజానీకానికి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు, అని అట్టి వారికి కనీస వేతనం అమలు చేయకుండా పట్టించుకోక పోవడం అన్యాయం అన్నారు. ఈసమ్మె కు సెంట్రింగ్ యూనియన్ ఉండవెల్లి B కృష్ణ,సైదు భాష,మధు, నాగరాజు,మద్దతు తెలిపారు. సమ్మె లో ఆశ వర్కర్లు అమ్ములమ్మ, పుష్పావతి, వెంకటేశ్వరమ్మ, మదనమ్మ, రాజమ్మ, పద్మావతి,వరలక్ష్మి, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.