ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ సెప్టెంబర్ 3 (జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మండలంలోని ఎమ్మెల్యే మణిక్ రావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లో జరిగిన కార్యక్రమల్లో పాల్గొని, ఆసరా పెన్షన్ల పత్రాలను పంపిణీ చేశారు, అనంతరం రాజినెల్లి గ్రామంలో కొంత మంది నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మొదటగా ఎమ్మెల్యే మణిక్ రావు చేతుల మీదుగా కొన్ని పత్రాలను పంపిణీ అనంతరం రాజినెల్లి గ్రామంలో గ్రామ సీనియర్ నాయకులు రాజవర్ధన్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను పంపిణీ చేసిన కోహిర్ మండల తెరాస సీనియర్ నాయకులు మ్యాథరి ఆనంద్ పెన్షన్ పత్రాలను భద్రంగా ఉంచుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల తెరాస అధ్యక్షుడు నర్సింలు యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటరెడ్డి, జడ్పి సీఈఓ ఎల్లయ్య, రచన్న స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ రాజుస్వామి, ఎంపిడిఓ సుజాత నాయక్, ఎస్సీ విజిలెన్స్ జిల్లా మేంబర్ బంటు రామకృష్ణ, నాయకులు గోవర్ధన్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్, సర్పంచ్ వెంకట్ రామ్ రెడ్డి, మాద్రి సర్పంచ్ రమేష్, గురుజువడా సర్పంచ్ సంగారెడ్డి, మొగ్దుం పల్లి లచ్చమ్మ, మచిరెడ్డి పల్లి ఏసురత్నం, పిచారేగడి సర్పంచ్ జె రవికిరణ్, బిలాల్ పూర్ సర్పంచ్ నర్సింలు, నర్సింహ రెడ్డి, పద్మారావు అధ్యక్షుడు,
దశరథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎమ్ ఏ కలిమ్, సవుద్ షాహిద్, ఇఫ్తేఖర్ అధ్యక్షులు, భాస్కర్, అనిల్, నర్సింలు యాదవ్, కోహిర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.