ఆసీస్ను కూల్చేశారు!
గాలె(శ్రీలంక) : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బ్యాట్స్‌మెన్‌లో డిల్‌రువాన్ పెరెరా 64, మాథ్యూస్ 47, కుశాల్ పెరెరా 35, డిసిల్వ 34, హెరాత్ 26 పరుగులు చేశారు.
అయితే 413 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను శ్రీలంక ఆదిలోనే పెద్ద దెబ్బ కొట్టింది. 5 ఓవర్లలో 10 పరుగులకే 3 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన డిల్‌రువాన్ పెరారా నాథన్ లియన్, కవాజాలను డకౌట్ చేశాడు. తర్వాత జోయ్ బర్న్స్‌ను రెండు పరుగుల వద్ద హెరాత్ పెవీలియన్‌కు పంపాడు. దీంతో కెప్టెన్ స్టీవెన్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసిస్ గెలవడం అసాధ్యం. దీంతో ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచిన శ్రీలంక రెండో టెస్ట్‌ను కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
స్కోర్ వివరాలు :
శ్రీలంక ఫస్ట్ ఇన్నింగ్స్ : 281/10
ఆసిస్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 106/10
శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్ : 237/10
ఆసిస్ సెకండ్ ఇన్నింగ్స్ : 25/3 (6 ఓవర్లలో, రోండో రోజు ఆట ముగిసింది.)