ఆసుపత్రి నుండి ఓ వ్యక్తి అదృశ్యం

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు
వికారాబాద్ రూరల్ జూలై 19 జనం సాక్షి
వైద్య చికిత్సలు చేయించుకోవడానికి ఆసుపత్రి నుండి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన జుంజురు వీరయ్య వయస్సు55 సంవత్సరాలు గత మంగళవారం వైద్య చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఆస్పత్రి నుంచి వీరయ్య ఎటు వెళ్లిపోయాడు తెలియడం లేదు ఆసుపత్రికి సిబ్బందిని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా మాకు ఏమి తెలియదు పోలీసులకు ఫిర్యాదు చేయండి అనే సలహా ఇచ్చారు కుటుంబ సభ్యులు సంగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వెతికి పెడతామని చెప్పి వారం రోజులు గడిచిన ఇప్పటివరకు జాడ కనుగొనలేకపోయారు దీంతో కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర వివిధ పట్టణాల్లో వెతికిన ఫలితం లేకపోయింది దీంతో వీరయ్యను వెతికి పెట్టిన వారికి 20 వేల బహుమానం ఇస్తామని కుటుంబ సభ్యులు అనంతయ్య సుధాకర్ తెలిపారు