ఆస్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ….
అన్నవరం రవికాంత్
ములుగు బ్యూరో,ఆగస్ట్31(జనం సాక్షి):-
ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరం రవికాంత్ ఆధ్వర్యంలో ములుగు పట్టణంలో ఎస్బిఐ బ్యాంక్ ముందు ఉదయం మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది.పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మట్టి విగ్రహాలు ప్రతిష్టించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా అన్నవరం రవికాంత్ భక్తులకు తెలిపారు.మట్టి విగ్రహాలు ప్రతిష్టించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగిలి రవితేజ,రుద్రోజు ఆనందచారి, కత్తెరపల్లి భాస్కర్,మిట్టపల్లి యశ్వంత్, రాకేష్,కుమార్ తదితరులు పాల్గొన్నారు.