ఆస్ట్రేలియాలోని పెర్త్‌హిల్స్‌లో అరుదైన తాబేలు పట్టివేత

636072853796041419పెర్త్ : తూర్పు ఆస్ట్రేలియాలోని పెర్త్‌హిల్స్‌లో ఓ ఇంటి నుంచి అరుదైన తాబేలును వన్యప్రాణుల  సంరక్షణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచంలోనే అంతరించిపోతున్నజాతికి చెందిన ఈ తాబేలు ఎంతకాలం నుంచి ఆ ఇంట్లో ఉందనేది అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఈ మగ టార్టాయిస్‌ను 1990లో పెర్త్‌లో పుట్టిన 228వ నెంబర్ తాబేలుగా అధికారులు గుర్తించారు. 1990 దశకం మధ్యలో ఈ తాబేలును అధికారులు ట్విన్ స్వాంప్స్ నేచర రిజర్వ్స్‌లో వదిలిపెట్టారు. చిత్తడినేలల్లో జీవించే ఈ జాతి తాబేళ్లను ప్రపంచంలోనే అంతరించిపోతున్న అరుదైన జాతివిగా గుర్తించారు.