ఆస్ట్రేలియాలో భారతీయ స్క్వాష్ క్రీడాకారులకు 3 పతకాలు

కాన్‌బెర్రా: రియా ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి పివీ సింధు భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేయగా, ఆస్ట్రేలియాలో జరుగుతున్న డబ్ల్యుఎస్ఎఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ డబుల్స్‌లో భారత స్క్వాష్ ప్లేయర్లు మూడు మెడల్స్ సాధించి ఇండియాకు గర్వకారణంగా నిలిచారు. ఒలంపిక్ క్రీడల్లో స్క్వాష్‌కు చోటు లేనందున ఆస్ట్రేలియాలోని డార్విన్‌లో డబ్ల్యుఎస్‌ఎఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ డబుల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఇండియా 3 మెడల్స్ సాధించడం ద్వారా తొలిసారి ఛాంపియన్‌షిప్స్ చరిత్రలో రికార్డు సాధించారు. మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరిలో సౌరవ్ ఘోసల్, దీపిక పల్లికల్ జోడీ సిల్వర్ మెడల్ సాధించారు. సెకెండ్ మిక్స్‌డ్ డబుల్ పెయిర్ హరీందర్ పాల్ సంధు, జోష్న చిన్నప్ప… కాంస్య పతకం గెలుచుకున్నారు. ఉమన్స్ డబుల్స్ కేటగిరిలో చిన్నప్ప, దీపిక పల్లికల్ జోడీ మరో కాంస్య పతకం సాధించారు. మూడు మెడల్స్ సాధించడం ద్వారా ఇండియన్ ప్లేయర్స్ ఆస్ట్రేలియాలో సాధించిన ఘన విజయాలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.