ఆస్తిపన్ను వసూలులో జిల్లా మొదటి స్థానం

-అదనపు జేసి డాక్టర్‌ నాగేంద్ర
కరీంనగర్‌,మార్చి31(జ‌నంసాక్షి): ఆస్తిపన్ను వసూలులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నాగేంద్ర పేర్కొన్నారు. ఆస్తిపన్ను వసూలు, ఐఎస్‌ఎల్‌ నిర్మాణాలు, సంక్షేమ యూనిట్ల గ్రౌండింగ్‌పై ఎంపిడిఓలు, ఈఓపీఆర్డీలతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 70శాతం ఆస్తిపన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే కరీంనగర్‌ జిల్లా అగ్రస్థానంలో నిలించిందని, ఇదే స్పూర్తితో వందశాతం పన్నులు వసూలు చేయాలన్నారు. జిల్లాలో 1207 గ్రామపంచాయితీలు ఉండగా అందులో 749 గ్రామపంచాయితీలలో వందశాతం ఆస్తిపన్ను వసూలు చేశారని ఇందులో జగిత్యాల డివిజన్‌లో 358గ్రామాలు, కరీంనగర్‌ డివిజన్‌లో 98గ్రామాలు, పెద్దపల్లిలో 293 గ్రామాలున్నాయన్నారు.ఆస్తిపన్ను వసూలులో 66శాతం మహబూబ్‌నగర్‌ రెండవస్థానంలో ఉండగా 65శాతంతో ఆదిలాబాద్‌ మూడవ స్థానంలో, 64శాతంతో మెదక్‌ నాలుగవ స్థానంలో ఉందన్నారు.పన్నుల వసూలులో జిల్లాల మద్య పోటీ తీవ్రంగా ఉందని, కరీంనగర్‌ జిల్లాను వందశాతంలో టాప్‌స్థానంలో నిలపాలన్నారు. జిల్లాకలెక్టర్‌ ప్రతి బుదవారం పన్నుల వసూలుపై సవిూక్షిస్తున్నారని, గ్రామాలలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో ఇదివరకే సిరిసిల్ల, వేములవాడ  నియోజకవర్గాల్లో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. త్వరలోనే పెద్దపల్లి డివిజన్‌కూడా ఈ దశకు చేరుకుంటుందన్నారు.ఎస్సీ, ఎస్టీ,బిసి మైనార్టీ సంక్షేమశాఖల ద్వారా మంజూరైన సబ్సీడి యూనిట్లను మార్చి 31లొగా వందశాతం గ్రౌండింగ్‌ చేయాలన్నారు. సమావేశంలో ఇంచార్జి డీపీఓ, జడ్పీ సీఈఓ సూరజ్‌కుమార్‌, డ్వామా పిడి వైవి గణెళిశ్‌,, బిసి కార్పోరేషన్‌ ఎడి ఇందిర తదితరులు పాల్గొన్నారు.