ఇంకెన్నాళ్లీ ఆర్థిక అసమానతలు
వ్యవసాయరంగం పురోగమిస్తేనే అభివృద్ది సాధ్యం
వ్వయసాయాధారిత పరిశ్రమల స్థాపన లక్ష్యం కావాలి
న్యూఢల్లీి,ఆగస్ట్14 (జనం సాక్షి) : దేశంలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం ఈ దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచిస్తున్నా..అందుకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. దేశ జనాభాకు అనుగుణంగా అవసరమైన పంటలను ప్రోత్సహించాలి. వ్యవసాయ దిగుబడులను తగ్గించి, ఎగుమతులను పెంచుకోవాలి. వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలన్న సూచనలు పెడచెవిన పెడుతున్నారు. నదుల అనుసంధానం జరగడం
లేదు. పూర్తి విద్యుత్ ఉత్పత్తి దిశగా పెట్టబడులు రావడం లేదు. మన దేశం అభివృద్ధి సాధించాలంటే గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలని గత ఫిబ్రవరి 27న మహారాష్ట్రలోని యవత్మాల్‌లో మోడీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో వ్యవసాయాన్ని అభివృద్ది చేసి, రైతుల ఆదాయాన్ని రెండిరత
లు చేస్తానన్న మోడీ హావిూ పదేళ్లయినా అమలు కావడం లేదు. దేశ జనాభాలో 60 శాతం మందికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయినా ఈ రంగాన్ని పైకి తీసుకుని రావడం, వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం జరగడం లేదు. పప్పుల ధరలు పెరుగుతున్నా, మనదేశంలో పప్పు పంటలను ప్రోత్సహించడం లేదు. నూనె ధరలు పెరుగుతున్నా, నూనెగింజల పంటలకు ప్రోత్సాహం దక్కడం లేదు. 2018-19 నాడు 7.8 శాతం అభివృద్ధితో వున్న వ్యవసాయరంగం 2024 మార్చి నాటికి 0.6 శాతానికి పడిపోయింది. వేగంగా దిగజారిపోతున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవలసి వుంది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. అంతెందుకు ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి గత సంవత్సరం కంటే రూ.24,894 కోట్లు, ఆహార సబ్సిడీకి రూ.7,082 కోట్లు తగ్గించేశారు. రానున్న రోజుల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు మరింతగా పెరుగుతాయి. పంటల పెట్టుబడి సహాయం పెంచకుండా, కనీస మద్దతు ధర, ఉచిత బీమా అమలు చేయకుండా వ్యవసాయ సంక్షోభాన్ని బిజెపి ప్రభుత్వం మరింత తీవ్రం చేస్తున్నది. ఆహార సబ్సిడీ తగ్గించడంతో పేదలకు అందుతున్న రేషన్ సరుకుల కోటా తగ్గిపోతుంది. ఆకలి కేకలు పెరుగుతాయి. వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు కొంత ఊరటనిస్తున్న గ్రావిూణ ఉపాధి హావిూ పథకానికి ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.86 వేల కోట్లలో, ఇప్పటికే చేసిన పనులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.41,500 కోట్లు పోను, మిగిలింది కేవలం రూ. 44,500 కోట్లు. ఇంత తక్కువ డబ్బుతో కోట్ల మంది పేదలకు పనులు ఎలా కల్పిస్తారన్నది అర్థం కావడం లేదు. అన్నింటికి మించి ఉపాధి పనులను వ్యవసాయానికి అనుబంధించాలన్న డిమాండ్ పట్టించుకోవడం లేదు. దేశంలో వ్యవసాయ కూలీలు దొరకడం లేదు. పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. అలాగే సామాన్యులకు తిండిగింజలు దొరకడం లేదు. అధిక ధరలతో సామాన్యులు ఉప్పులు, పప్పులు కొనుక్కోలేక పోతున్నారు. ఈ సమస్యలను పార్లమెంటు చర్చించదు. బయటా చర్చించం లేదు. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. దేశంలో పని చేయగలిగిన శ్రామికుల సంఖ్య 64 శాతానికి పెరిగిందని, కేవలం 37 శాతం మందికి మాత్రమే పనులు దొరికాయని ఓ నివేదిక తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌గా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ ప్రభావంతో నిరుద్యోగం మరింత తీవ్రం కానుంది. ఐటి సేవల రంగాలలో తక్కువ నైపుణ్యం ఉంటే చాలన్న రీతిలో సాగుతోంది. ఐటి కంపెనీలు కూడా ఉద్యోగులను ఉన్న పళంగా తీసేస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయానుబంధ రంగాలను బలోపేతం చేయడం మినహా మరో గత్యంతరం లేదు. అయినా ఇటువైపు పాలకులు దృష్టి సారించడం లేదు. ప్రధాని మోడీ చెబుతున్నట్లుగా 2047 నాటికి దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే విద్యారంగం, వ్యవసాయరంగం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. అత్యధిక అక్షరాస్యత వున్న కేరళ తలసరి ఆదాయం దేశంలో మొదటి స్థానంలో వుంది. తర్వాత స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ వున్నాయి. బీహార్ తలసరి ఆదాయం అతి తక్కువగా వుండడానికి అక్షరాస్యత కూడా ముఖ్య కారణమన్నారు. ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, గ్రావిూణాభివృద్ధి రంగాలన్నింటికి నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాలను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ సేవలు కుదించుకుపోయాయి. పేద, మధ్య తరగతి వారికి వచ్చే అరకొర
ఆదాయం నుండి విద్య, వైద్యానికి చేసే ఖర్చులు పెరిగిపోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఆర్థిక అంతరాలను తగ్గించడానికి సంపన్నుల విూద పన్నులు వేయడానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదు.
పేదరికం లేని సమాజం కోసం ప్రణాళికలు అమలు చేయడం లేదు. వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురి కావడంతో ఆహారభద్రత కూడా లేకుండా పోతున్నది. ఈ క్రమంలో వ్యవసాయాన్ని బలోపేతం చేస్తు తప్ప దేశం ఆర్థికంగా అభివృద్ది సాధించలేదు.