ఇంగ్లండ్‌లో ఆడనున్నసాయి సుదర్శన్‌

సాయి సుదర్శన్‌ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌లో ఆడనున్న యువ సంచలనం!

మిళనాడు సూపర్‌ స్టార్‌, గుజరాత్‌ టైటాన్స్‌ యువ సంచలనం సాయి సుదర్శన్‌ తొలి సారి ఇంగ్లండ్‌ కౌంటీల్లో అడనున్నాడు. 21 ఏళ్ల సుదర్శన్‌ ఇంగ్లీష్‌ క్రికెట్‌ క్లబ్‌ సర్రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అతడు కౌంటీ ఛాంపియన్‌షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో సర్రే తరపున ఆడనున్నాయి. అయితే టామ్ లాథమ్, విల్ జాక్స్ , సామ్‌ కర్రాన్‌ వంటి సర్రే ఆటగాళ్లు తమ జాతీయ జట్టు విధుల కారణంగా ఆఖరి కౌంటీ మ్యాచ్‌లకు అందుబాటులో లేరు.

ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్‌ సర్రే తరపున ఇంగ్లండ్‌ కౌంటీల్లో అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉంది. సాయి సుదర్శన్‌ ప్రస్తుతం అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో పాటు తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో దుమ్మురేపాడు.

అదే విధంగా ఎమర్జింగ్‌ ఆసియాకప్‌లో కూడా సాయి అదరగొట్టాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అదరగొడుతున్న సుదర్శన్‌.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సర్రే క్రికెట్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్‌.. 42.71 సగటుతో 598 పరుగులు చేశాడు.