ఇంజనీర్స్‌డే వేడుకల్లో పాల్గొన్న జగన్‌

సింగపూర్‌కు రాజధాని పనులపై విమర్శ

విశాఖపట్నం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. 262వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శనివారం ఆయన బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంజనీర్‌ డే వేడుకల్లో

పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లను కాదని చంద్రబాబు నాయుడు సింగపూర్‌ కంపెనీలకు పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న టాలెంట్‌ ఇంజనీర్లను కాదని చంద్రబాబు విదేశీ వ్యక్తులకు రాష్ట్ర ప్రాజెక్టు పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు రాష్టాన్రికి చేసిన అభివృద్ధి గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా పడలేదని ఆరోపించారు. తన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు

తాజావార్తలు