ఇండియాగేట్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ: ఇండియాగేట్ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు మరోసారి జలఫిరంగులు, భాష్పవాయువు ప్రయోగించారు. రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు యత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చించేందుకు సిద్ధమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా అత్యాచార ఘటన బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పొలిస్తే మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు.