ఇండోనేషియా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్య

82కు చేరిన మృతులు: కొనసాగుతున్న సహాయక చర్యలు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): ఇండోనేషియాలోని లాంబాక్‌ దీవుల్లో భారీ భూకంపం సంభవించిన కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచరం మేరకు ఈ భూకంపం వల్ల 82 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మందికి గాయాలయ్యాయి. అనేకమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. 15 కిలోవిూటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. వారం కిందట కూడా ఇదే దీవిలో భూకంపం సంభవించగా 17 మంది మరణించారు. ఇప్పుడు వచ్చిన భూకంపందాని కంటే కూడా ఎక్కువేనని అధికారులు తెలిపారు. ఇండోనేషియాతో పాటు చుట్టుపక్కల దేశాల్లోనూ ప్రకంపనలు వచ్చాయి. వెయ్యి కిలోవిూటర్ల దూరంలో ఉండే బాలిలోనూ భూమి కంపించింది.భారీ భూకంపంతో బాలీలోని విమానాశ్రయం సీలింగ్‌ కుప్పకూలింది. ఇతర భవనాలు బీటలు వారాయి. ఈ భూకంపం సునావిూకి దారి తీస్తుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో వైపు సముద్రం పరిసరప్రాంతాల్లో ఉన్నవారు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు కోరారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగెత్తారు. మరోవైపు ఎన్డురారాయ్‌లో పలు నిర్మాణాలు కూలిపోయాయి. భూకంపం నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా విశాలమైన మైదాన ప్రాంతాల్లోకి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. అధికారులు తొలుత సునావిూ హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఈ భూకంపం తీవ్రతకు దాదాపు 900 కి.విూ దూరంలోని బాండుంగ్‌ నగరంలోనూ స్వల్పంగా నష్టం వాటిల్లింది. బాలి ద్వీపంలో భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. వారం రోజుల క్రితమే లాంబాక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చి 17 మంది మరణించారు. వందల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువ. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌పై ఈ దేశం ఉంది. ఇక్కడ టెక్టానిక్‌ ఫలకలు పరస్పరం ఢీకొంటాయి. అగ్ని పర్వతాలు బద్దలై లావా పొంగుతుంటుంది. 2004లో ఇండోనేషియాలోని సుమత్ర వద్ద సముద్ర గర్భంలో 9.3 తీవ్రతో వచ్చిన భూకంపం పెను విధ్వంసాన్నే సృష్టించింది. ఈ భూకంపానికి సునావిూ వచ్చి హిందూమహాసముద్రం వ్యాపించి ఉన్న దేశాల్లో 2,20,000 మంది మరణించారు. ఒక్క ఇండోనేషియాలోనే 1,68,000 మంది మరణించారు.