ఇండోనేసియాలో భూకంపం

ఇండోనేసియాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. కాగా దీనివల్ల సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. బాంటెన్ ప్రావిన్స్ లో లెబాక్ కు నైరుతి వైపున 271 కిలో మీsumatra-earthquakerటర్ల దూరంలో సముద్రంలో 10 కిలో మీట్లర లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దీనివల్ల సునామీ రాదని, భయపడాల్సిన పనిలేదని అధికారులు చెప్పారు. కాగా భూకంప తీవ్రత 5.6గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే నివేదిక వెల్లడించింది.