ఇంత దిగజారుడా. ప్రకృతి విపత్తులపై రాజకీయాలా!
` విపక్షాల వైఖరిని ఖండిరచిన మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్ల్(జనంసాక్షి): ప్రకృతి విపత్తుపై విపక్షాల రాజకీయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. వరదలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండి వరద బాధితులకు సహాయం అందిస్తున్నారని స్పష్టం చేశారు. విపక్ష నేతలు మాత్రం పార్టీ ఆఫీసుల్లో విూడియా ముందు రాజకీయం చేస్తున్నారని నిరంజన్ కాళేశ్వరం పంప్ హౌజ్‌లు నీట మునిగాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పంపు హౌజ్‌లు అనేవి ప్రాజెక్టుల పక్కనే ఉంటాయన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలకు లేదని విమర్శలు గుప్పించారు. ఎంతసేపు ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప.. మరొకటి లేదన్నారు.తెలంగాణకు కేంద్రప్రభుత్వ వరద సాయం ఏది? గుజరాత్‌కు తప్ప కేంద్రం తెలంగాణకు సాయం చేయదా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ నేతలు మాట వరసకైనా తెలంగాణకు వరదసాయం ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగరని నిలదీశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు, తెలంగాణకు నిధుల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా, తెలంగాణకు వర్శిటీలు, మెడికల్ కళాశాలల కేటాయింపు, తెలంగాణ ప్రభుత్వ రుణాల సేకరణ వంటి ప్రతి విషయంలో కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం అడ్డంకులను అధిగమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ పథకాలను సజావుగా కొనసాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్షకు ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారని మంత్రి నిరంజన్ రెడ్డి తేల్చిచెప్పారు.