ఇందిరాగాంధీకి ఘనంగా నివాళి
ఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 28వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,ప్రధాని మన్మోహస్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద నేతలు ఇందిరకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ జరిగిన సర్వమత ప్రార్థనల్లో నేతలు పాల్గోన్నారు.