ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తాము
జనగామ (జనం సాక్షి)అక్టోబర్31:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు మాజీ ప్రధాని ఇందిర గాంధీ 38వ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్య ఏరియా ఆస్పత్రి వద్ద పాలు బ్రేడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా పిసిసి మెంబర్ జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపన్యాసం, లో ముఖ్యంగా ఖంగుమని మోగే కంఠస్వరం, సామాన్యులలో కలసిపోయే ఆమె స్వభావం అందరినీ ఆకట్టుకునేవి. ఇది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు భారతదేశం మొట్టమొదటి మహిళ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా నిర్యాహించారు గాంధిగారి సూత్రాలని అనుసరించి సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో పేదప్రజాల కోసం 20 సూత్రాల పథకం రూపొందించి వెట్టిచాకిరి చట్ట విరుద్ధమని ప్రకటించింది గరీబీ హటావో అనే నినాదం దేశం లో పేదరిక నిర్ములన కోసం దీర్ఘకాలిక ఫథకాలు ప్రవేశపెట్టి దేశంలో పేదరికం తగ్గడానికి ముఖ్య కారణమూ అని తెలిపారు
ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా నాయకులు కట్ట కృష్ణ రంగు రవి జనగామ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్.డిమాజిద్ జనగామ పట్టణ నాయకులు జాఫర్ షరిఫ్ మోర్తల ప్రభాకర్ సుల్తాన్ గోవింద రెడ్డి జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ యండి ఫయాజ్ జయ మల్లేశ్ మహేశ్వరం శ్రీనివాస్ తాటి కనుకస్వామి చింతకింది నరేష్ శ్రీనివాస్ కొండ శ్రీనివాస్ సౌడ మహేష్ మడురు రాజు పులిగిల్ల శివ యాదవ్ బెజడి హరీష్ కసాని విజయ్ తదితరులు పాల్గొన్నారు



