ఇందిరా నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా
. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 19, ( జనం సాక్షి ) : స్టేషన్ ఘన్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధి లో గల ఇందిరా నగర్ కాలనీ అభివృద్ధికి 15 లక్ష ల నిధులతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహ రి అన్నారు.కాలనీవాసుల కోరిక మేరకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇందిరా నగర్ కాలనీ సందర్శించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఇందిరా నగర్ లో సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపి స్తున్నాయని అన్నారు.ప్రాథమికపాఠశాలముందు పిల్లలకు ఇబ్బంది కలగకుండా చదును చేయించా లని,పాఠశాల వద్ద తన సొంత నిధులతో వంటశా ల నిర్మాణానికి కృషిచేస్తానన్నారు.ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ను, ఇండ్లపై నుంచి వెళ్లిన విద్యుత్ లైన్లను తొలగించడానికి సంబంధి త అధికారులతో మాట్లాడడం జరిగింది అన్నారు. సి సి రోడ్డు నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేస్తానన్నారు. తాటికొండ రోడ్డు నుండి ఇందిరా నగర్ వరకు సర్వీస్ రోడ్డు వేసేల కృషి చేస్తానన్నా రు. ప్రభుత్వ స్థలంఉంటే కమ్యూనిటీ హాలు ఏర్పా టు కూడా నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఈసమావేశంలో సర్పంచుల ఫోరం మండలఅధ్య క్షుడు పోగుల సారంగపాణి, నాయకులు రాపోలు మధుసూదన్ రెడ్డి,బూర్ల శంకర్,నీల గట్టయ్య, కోతి రాములు గౌడ్,నాగరబోయిన యాదగిరి, భూక్య స్వామినాయక్, రాంబాబు, నీలసోమన్న, ఐలోని సుధాకర్,సానాదిరాజు,పోకలనారాయణ, గాండ్ల రాజు, తోకల సమ్మయ్య తదితరులు పాల్గొ న్నారు.