ఇద్దరు అనాధ  కూతుర్లను దత్తత తీసుకున్న పట్నం మాణిక్యం ఫౌండేషన్

 

వీరి బాగోగులు మేమే చూసుకుంటాం

ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , జూలై 19 :ఇద్దరు అనాధ  కూతుర్లను పట్నం మాణిక్యం ఫౌండేషన్దత్తత తీసుకుంటున్నట్లు, వారి బాగోగులను మేమే చూసుకుంటామని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అన్నారు.ఫసల్ వాది లోని తన నివాసంలో ఇద్దరు అనాధ కూతుర్ల విషయాన్ని తెలుసుకుని, వారిని తన ఇంటికి పిలిపించుకొని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం మరియు గ్రామం లోని నివసిస్తున్న  బేగరి మెర్సీ,బేగరి జోయసీ లతో మాట్లాడారు. పిల్లల తల్లిదండ్రులు  బేగరి మొగులయ్య,అమృత లను బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయారనీ ప్రస్తుతం 7th క్లాస్ ఒకరు 10th క్లాస్ ఇంకొకరు, తన మేనమామ దగ్గరే ఉంటూ జీవితం గడుపుతున్నార నీ వారు తెలిపారు.ఇట్టి విషయం తెలుసుకున్న పట్నం మాణిక్యం  వారిని  పట్నం మాణిక్యం ఫౌండేషన్ కి అడాప్ట్ చేసుకుంటూ, ప్రస్తుతం 50000/-రూపాయలు ఇచ్చి, వారు చదువుతున్న చదువులకు పూర్తి ఖర్చు ప్రతినెల పట్నం మాణిక్యం ఫౌండేషన్  భరిస్తుంది అని హామీ ఇస్తూ, పూర్తి బాధ్యత తీసుకున్నారు. మరియు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని వాగ్దానం చేశారు.ఇందుకు పిల్లలు వారి మేన మామ హర్షం వ్యక్తం చేసి పట్నం మాణిక్యం కు ధన్యవాదాలు తెలిపారు.