ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌,నవంబర్‌22: ఉపాధిహావిూ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. ఇప్పటికే వీరిపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. కోహెడ, మల్హర్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశం ఉపాధి హావిూ పనుల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. చేయని పనులకు వీరు బిల్లులు కాజేశారు. ఫిర్యాదులు రావడంతో ఉపాధిపనులపై విచారణకు ఆదేశించారు. విచారణలో వీరు అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ వీరిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్రమార్కులకు ఇదో హెచ్చరిక అని పలువురు వ్యాఖ్యానించారు.