ఇద్దరు కుమార్తెలతో సహా.. రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న తల్లి 


– విజయనగరంలో విషాధ ఘటన
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
– కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న పోలీసులు
విజయనగరం, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : ఆతల్లికి ఏం కష్టమొచ్చిందో.. ఏమో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. హృదయవిదారకమైన ఈ ఘటన విజయనగరం జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణంలోని బెలగాం రైల్వేస్టేషన్‌ వద్ద బుధవారం ఉదయం తల్లీకూతుళ్లు రైలు కింద పడి తనువుచాలించారు. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు ముక్కలు ముక్కలుగా తెగిపడటంతో చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను పార్వతీపురం బోర వీధికి చెందిన శివపుకుమారి, రితిక(6), యామిని(4)గా గుర్తించారు. బుధవారం ఉదయం తన కుమార్తెలతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చిన శివకుమారి, కదలుతున్న రైలు కిందకు వారితోపాటు దూకేసింది. దీంతో రైలు వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, వారి బంధువులకు సమాచారం అందించారు. గత మార్చిలోనూ ఇదే విధంగా ఓ తల్లి తన కుమార్తెలతో కలిసి గరివిడి రైల్వేస్టేషన్‌ సవిూపంలో ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవపడి ఆమె పిల్లల్ని రైలు కిందకు తోసి తాను కూడా వారితోపాటు దూకి తనువు చాలించింది.

తాజావార్తలు