ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
కరీంనగర్ : చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డ వీరు బంగారు గొలుసులను లాక్కెళ్లారు. అయితే… రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా… ఇప్పటివరకు హైదరాబాద్ మహానగరానికే పరిమితమైన ఈ చైన్ స్నాచింగ్‌లు కరీంనగర్‌తోపాటు, వరంగల్ నగరానికి పాకాయి. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ ముఠా నగరాల్లోకి ప్రవేశించి ఈ తరహ దోపిడీలకు పాల్పడుతోందని సమాచారం