ఇప్పటికిప్పుడే ఆందోళనను విరమించబోం. రాకేశ్‌ టికాయత్‌

దిల్లీ: సాగు చట్టాల రద్దుపై రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌ స్పందించారు. ‘‘ఇప్పటికిప్పుడే ఆందోళనను విరమించబోం. పార్లమెంట్‌లో సాగు చట్టాల రద్దు కోసం వేచి చూస్తాం. కనీస మద్దతు ధరతో పాటు రైతుల సమస్యలపై చర్చించాలి’’ అని టికాయత్‌ డిమాండ్‌ చేశారు. కాగా నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని అన్నారు.