ఇమ్మిగ్రేషన్‌ ఉల్లంఘనలు

300మందికి పైగా విదేశీయుల అరెస్ట్‌

న్యూయార్క్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఆరు రాష్ట్రాలలో నేర కార్యాకలాపాలకు, ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై 300 మందికి పైగా విదేశీయులను అమెరికా అధికారుల అరెస్టు చేయగా, వీరిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఇండియానా, ఇల్లినాయిస్‌, కాన్సాస్‌, కెంటుకీ, మిస్సోరి, విస్కాన్సిన్‌ అంతటా చర్యల్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌లో విదేశీ నేరస్థులు , ఇమ్మిగ్రేషన్‌ను ఉల్లంఘన కింద 364 మందిని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసిఇ), ఫెడరల్‌ అధికారులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 25 దేశాలకు చెందిన వారు అరెస్టు కాగా,ఆరుగురు భారతీయులు ఉన్నారు. కొలంబియా, చెక్‌ రిపబ్లిక్‌, ఈక్వెడార్‌, జర్మనీ, ఇతర దేశస్తులు వున్నారు. అరెస్టైన 364 మంది 187 మందిపై నేరారోపణలు జరిగాయి. వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు. ఇల్లినాయిస్‌లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడటంతో భారత్‌కు చెందిన వ్యక్తిని అరెస్టుచేశామని అధికారులు తెలిపారు.

————–