ఇలాగే ప్రవర్తిస్తే ప్రత్యక్షంగా దిగాల్సి వస్తుంది….. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు..
నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కి ఎదురుగా పెట్టినటువంటి ఫ్లెక్సీకి సంబంధించిన వివాదంపై ఈరోజు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు వారి అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ఇలాంటి చిల్లర వేషాలు వేసే వాళ్లకు చీల్చి చెండడుతానని దమ్ముంటే ప్రత్యక్షంగా చూసుకుందామని అన్నారు. ఫ్లెక్సీలలో పెట్టినటువంటి కొటేషన్ శిఖండి, భీష్ముడు ఎవరని మరియు పద్మవ్యూహం పన్నడనికి అభిమన్యుడు ఎవరని ప్రత్యక్షంగా విమర్శించారు. దీనిపై రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని దే ఆయన పేర్కొన్నారు ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ కుంటాల మాజీ ఎంపీపీ రమణ రావు సీనియర్ నాయకులు సౌన్లి రమేష్ పండిత్ పటేల్ మెండే శ్రీధర్ చిన్నారావు తదితరులు ఉన్నారు