ఇల్లందు ఏరియా లో పర్యటించిన డైరెక్టర్(పిపి)

టేకులపల్లి, ఆగస్టు 23( జనం సాక్షి ): సింగరేణి సంస్థ డైరెక్టర్(ప్రాజెక్ట్ & ప్లానింగ్) జి.వెంకటేశ్వర రెడ్డి బుధవారం ఇల్లందు ఏరియా లోని జె.కె, కోయగూడెం ఉపరితలగనులలో పర్యటించారు. ఈ సందర్బంగా వారు ఓసి పని స్థలాలను సందర్శించి అక్కడ జరుగుచున్న పనులను పరిశీలించారు. రోజు వారి బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబి బ్లాస్టింగ్, లోడింగ్ పనులను జి.యం జాన్ ఆనంద్ ను అడిగి తెలుసుకున్నారు. తరువాత డైరెక్టర్(పిపి) జి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజు వారి లక్ష్యాలను అధికమించాలని, వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణాకు ఎటువంటి ఆటంకములు కలుగకుండా ముందస్తు జాగ్రతలు తీసుకోవాలని, అంతేకాకుండా రక్షణతో కూడిన ఉత్పత్తి తీయాలని, సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అనంతరం వారు ఏరియా సి.హెచ్.పి నందు నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రివేబిన్ కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్ కు తగు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో ఏరియా జి.యం.జాన్ ఆనంద్, ఎస్ వోటు జియం మల్లారపు మల్లయ్య, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీనివాసు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ప్రహ్లాద్, బొల్లం వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్స్ శివ శంకర్, చిన్నయ్య, మేనేజర్స్ పూర్ణ చందర్, సౌరబ్ సుమన్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.