ఇల్లందు డి ఎస్ పీ ఎస్వీ రమణమూర్తి సూచన.. ప్రజల రక్షనే మా ధ్యేయం..

భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఇల్లందు డి ఎస్ పి. ఎస్.వి రమణమూర్తి సూచనలు వెల్లడించారు. పండుగలకు, శుభకార్యాలకు, సెలవులకు మొదలుకొని ఇంటిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని సూచించారు. వరుస దొంగతనాలు జరుగుతున్న క్రమంలో అలాంటి అవాంఛనీయ సంఘటనలను సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు 80194 70958 ఈ ఫోన్ నెంబర్ కి నేరుగా కానీ, వాట్సాప్ ద్వారా కానీ వారి పూర్తి వివరాలు గూగుల్ లొకేషన్ పంపించడం ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలిoగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని డి.ఎస్.పి రమణమూర్తి ఈ శనివారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. సాధ్యమైనంతవరకు విలువైన వస్తువులను ఆభరణాలను తమ ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. పండుగ సెలవులకి ఫంక్షన్లకు దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసు వారికి సమాచారాన్ని అందించి ప్రజలందరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు